కామారెడ్డి, అక్టోబర్27 (విజయక్రాంతి): అతిథులను గౌరవించ డంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఇంగ్లాండ్‌కు చెందిన పీటర్సన్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర నిర్వహి స్తున్న పీటర్సన్ ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. తనకు దారి పొడ వున భారతీయులు టీ, బ్రేక్‌ఫాస్ట్ అం దిస్తున్నారని పేర్కొన్నాడు. తాను గతేడాది కూడా భారత్‌యాత్ర చేపట్టి నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను తమిళనాడులోని ధనుష్కోటికి వెళ్తున్నట్లు పీటర్ పేర్కొన్నాడు.