calender_icon.png 16 January, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెఫ్ షూటింగ్‌లో భారత్‌కు పసిడి

04-09-2024 12:40:56 AM

హనోవర్: జర్మనీలోని హనోవర్ వేదికగా జరుగుతున్న ప్రపంచ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో స్వర్ణపతకం గెలుచుకుంది. భారత్‌కు చెందిన మహిత్ సంధు, ధనుష్ శ్రీకాంత్ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది. నటాషా, ముర్తజా జోడీ రజతం గెల్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రంజలి ధుమాల్, అభినవ్ దేశ్వాల్ జోడీ రజతం గెలుచుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 12 పతకాలు వచ్చాయి. 

లక్ష్యకు స్వర్ణం

ఫరీదాబాద్‌లో జరుగుతున్న మానవ్ రచ్‌నా ఓపెన్ ట్రాప్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో లక్ష్యషెరాన్ షూటింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 25 సంవత్సరాల లక్ష్య 2018లో జకర్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో రజతం గెల్చుకుని సత్తా చాటాడు. స్వర్ణం గెలిచిన లక్ష్యకు 50, 000 నగదు బహుమతి అందనుంది. రిజ్వి, మాలిక్ రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన 36 మంది షూటర్లు పాల్గొన్నారు. ఫైనల్లో ఆరుగురు షూటర్లు పోటీపడగా లక్ష్య షెరాన్ స్వర్ణం కొల్లగొట్టాడు.