న్యూఢిల్లీ: 20వ ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 31 తేడాతో హాంగ్ కాంగ్‌పై విజయాన్ని అందుకుంది.
భారత్ విజయంలో భావన శర్మ, మెనికా కీలకపాత్ర పోషించారు. భావన శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో కజకిస్థాన్ చైనాపై, జపాన్ ఇరాన్‌పై, దక్షిణ కొరియా సింగపూర్‌పై విజయాలు సాధించాయి.