బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో కంగనా ఇందిరాగాంధీగా కనిపించనున్నారు. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది.
జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదలైంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. ట్రైలర్‌లో ‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ అనే నినాదం మరోసారి వినిపిస్తోంది. అయితే ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.