calender_icon.png 18 November, 2024 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానంలా వందే భారత్

02-09-2024 12:20:44 AM

ప్రొటోటైప్ స్లీపర్ కోచ్‌ను ఆవిష్కరించిన వైష్ణవ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న వందే భారత్ రైళ్లలో మరో అత్యాధునిక అంకానికి తెరలేచింది. వందేభారత్ స్లీపర్ ప్రొటోటైప్ కోచ్‌ను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం ప్రారంభించారు. బెంగళూరులోని బీఈఎంఎల్‌లో ఈ అత్యాధునిక బోగీని ఆయన పరిచయం చేశారు. ‘వందే భారత్ చైర్ కార్ల తర్వాత.. ఇప్పుడు వందేభారత్ స్లీపర్ కార్లపై పనిచేస్తున్నాం. వీటి నిర్మాణం పూర్తయ్యింది. ఈ రైళ్ల ట్రయల్స్ మొదలవుతున్నాయి’ అని తెలిపారు. కోచ్ లోపలి భాగానికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. ఈ కోచ్‌లు విమానంలోని బిజినెస్ క్లాస్‌ను తలదన్నేలా ఉండటం విశేషం. మరో మూడు నెలల్లో ఈ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వైష్ణవ్ వెల్లడించారు.