03-04-2025 09:23:38 AM
భారత్ చాలా కఠినమైన దేశం: మోదీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మోదీని పొగుడుతూ.. భారత్‌కు ట్రంప్ ఝలక్
భారత ప్రధాని మోదీ నాకు గొప్ప మిత్రుడు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) వెల్లడించారు. లిబరేషన్ డే కార్యక్రమంలో కేబినెట్ సభ్యులు, స్టీల్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల్లో తాము సగమే టారిఫ్ లు విధిస్తున్నట్లు వెల్లడించారు. పలు దేశాలపై జాలితోనే సగం సుంకాలే ప్రకటించానని అమెరికా ప్రెసిడెంట్(United States President) పేర్కొన్నారు. ప్రతీకార సుంకాలను రాయితీ టారిఫ్ లుకా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాకు దిగుమతయ్యే ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు తెలిపారు. భారత్ చాలా కఠినమైన దేశం అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నాకు గొప్ప మిత్రుడు అని ట్రంప్ సూచించారు. మోదీ మంచి మిత్రుడైనప్పటికీ మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదని ఆరోపించారు. అమెరికాపై భారత్ 52 శాతం పన్నులు వసూలు చేస్తోందని చెప్పారు. చాలా ఏళ్లుగా భారత్ నుంచి మేము దాదాపు ఏమీ వసూలు చేయలేదని అమెరికా ప్రెసిడెంట్ వివరించారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని ట్రంప్ ధ్వజమెత్తారు. పన్ను చెల్లింపుదారులను 50 ఏళ్లుగా దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రతీకార సుంకాల ప్రకటన(Trump tariffs announcement)తో అమెరికాలో మళ్లీ పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అమెరికా కార్లు విదేశాల్లో తక్కువగా అమ్ముడుపోతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అన్ని విదేశీ తయారీ ఆటో మొబైల్స్ పై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోల దిగుమతులపై కొత్త టారిఫ్ లు పెంచబోతున్నట్లు పేర్కొన్నారు.