calender_icon.png 10 March, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ దే విజయం..

09-03-2025 10:26:40 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠభరితంగా విజయం సాధించి రికార్డు స్థాయిలో మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్ మన్ గిల్ (31) పరుగులు చేయగా... మాంచి ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్, 2013లో మళ్లీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 2025లో మరోసారి టోర్నమెంట్‌ను ట్రోఫీతో ముగించారు. 

భారత స్పిన్నర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. న్యూజిలాండ్‌(New Zealand)ను 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులకే పరిమితం చేయడంతో భారత్‌ విజయానికి సహాయపడింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(Daryl Mitchell(63) పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండగా, రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) పరుగులు చేశారు. కాగా, విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14), కెప్టెన్ మైకేల్ శాంట్నర్ (8) తక్కువ పరుగులతో నిరాశపరిచారు. చివర్లో మైఖేల్ బ్రేస్‌వెల్(Michael Bracewell) (53*) అర్ధ సెంచరీతో బ్లాక్‌క్యాప్స్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లతో రాణించాగా... జడేజా, షమీ చెరో వికెట్ తీశారు.