ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ( విజయ క్రాంతి): ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రోజున 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, గాంధీ చౌరస్తా, నెహ్రూ చౌరస్తాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రపంచంలో భౌగోళికంగా 7వ పెద్ద దేశం మన దేశమని,ప్రాచీన సింధు నాగరికత మన సొంతమని అన్నారు. సుమారు 40 శాతం యువతరం ఉన్న దేశమని, వాణిజ్య రంగాలతో పాటు ఐటీ, ఫార్మసీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భారతీయులకు స్వేచ్ఛ,స్వాతంత్ర ఫలాలు అందించడం కోసం ఎందరో మహానుభావులు అలుపెరుగని పోరాటం చేశారని తమ ప్రాణాలను సైతం త్రుణ ప్రాయంగా ఇచ్చారని తెలిపారు. వారి త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి పౌరుడు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకట్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య,టిపిసిసి సభ్యులు కేడం లింగమూర్తి,కర్ణ కంటి మంజుల, కోమటి స్వర్ణలత, చిత్తారి పద్మ, బుక్య సరోజన, వల్లపు రాజు, ఐ లేని అనిత, బోల్లి కల్పన, బోజు రమాదేవి, ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.