calender_icon.png 9 November, 2024 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ సహజ భాగస్వామి

09-11-2024 12:17:59 AM

పుతిన్ ప్రశంసలు

న్యూఢిల్లీ, నవంబర్ 8: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించాడు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని అది ఓ గొప్ప దేశమని పేర్కొన్నారు. భారత్ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయన్నారు. సోచిలోని వాల్డాయ్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో పుతిన్ మాట్లాడుతూ.. ‘భారత్ ఓ గొప్ప దేశం. ఆదేశంతో మా సంబంధాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఏడాదికి దాదాపు 7.4 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తున్న భారత దేశానికి ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి పూర్తి అర్హతలు ఉన్నాయి.

భద్రత, రక్షణ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నాం. ఏడాదికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 బిలయన్ డాలర్లుగా ఉంది’ అని పుతిన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారానికి బ్రహ్మోస్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే ఉమ్మడి కరెన్సీని సృష్టించే లక్ష్యాలు లేవని వెల్లడించారు.