calender_icon.png 24 December, 2024 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్ ఆసియా కప్ ఫైనల్లో భారత్

21-12-2024 12:45:37 AM

సూపర్4లో లంకపై విజయం

సింగపూర్: అండర్ మహిళల టీ20 ఆసియా కప్‌లో యువ భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయా న్ని సాధించింది. తొలుత బ్యాటింగ్  చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. మానుడి ననయాకర (33) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 4 వికెట్లతో రాణించగా.. పరునికా 2 వికెట్లు తీసింది. అనంతరం భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. తెలంగాణ బ్యాటర్ గొంగిడి త్రిష (32), కమలిని (28), మిథిలా వినోద్ (17 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. లంక బౌలర్లలో చమోదీ ప్రబోద 3 వికెట్లు పడగొట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.