న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ఖోఖో ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల బృందం సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఢిల్లీ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 109 బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. రెండు టర్న్‌లు ముగిసేసరికి భారత్ 100 పాయింట్లు సాధించి పూర్తి ఆధిపత్య ప్రదర్శించింది. అన్ని టర్న్‌లు ముగిసేసరికి బంగ్లా కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే, రేష్మా రాథోడ్ మెరుపు ప్రదర్శనతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఉగాండా, సౌతాఫ్రికా, నేపాల్ విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టాయి.