12-03-2025 12:24:16 AM
న్యూఢిల్లీ, మార్చి 11: స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ విడుదల చేసిన “ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ జాబితాను చూస్తే భారత్‌లో వాయుకాలుష్యం ఎ లా పెరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైన మొదటి 20 నగరాల జా బితాలో భారత్ నుంచే 13 నగరాలు ఉం డ డం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా అస్సా ంలోని బర్నిహట్ నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కాలుష్యకోరల్లో చిక్కుకున్న రాజ ధానిగా ఢిల్లీ నిలిచింది.
ఇక ఈ జాబితాలో భారతదేశం ఐదో స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం 2023 తో పోల్చితే 2024లో మన దేశంలో గాలి నాణ్యత దా రుణంగా పడిపోయింది. దూళిరేణువుల శా తం 2023తో పోల్చితే తగ్గినప్పటికీ గాలి నాణ్యత మాత్రం మెరుగుపడలేదు. 2024 లో ఈ దూళిరేణువులు క్యూబిక్ మీటర్‌కు 50.6 మైక్రోగ్రాముల మేర ఉండగా.. ఈ వి లువ 2023లో 54.4గా నమోదవడం గమనార్హం.
అయినా ప్రపంచంలో 10 కాలుష్యనగరాల జాబితాలో భారత్ నుంచే 6 నగరాలు ఉన్నాయి. ఢిల్లీ మరోసారి అత్యంత కాలుష్య రాజధానిగా చోటు దక్కించుకుంది. ఢిల్లీలో 2023లో పీఎం 2.2 స్థాయిలు క్యూ బిక్ మీటర్‌కు 92.7 మైక్రోగ్రామ్స్ ఉండగా.. 2024లో ఈ విలువ 91.6గా నమోదైంది.
20లో 13 మనవే..
ప్రపంచవ్యాప్తంగా అధిక కాలుష్యం గల 20 నగరాల్లో భారత్ నుంచే 13 ఉన్నాయి. బర్నిహట్, ఢిల్లీ, ముల్లాన్‌పూర్, ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడీ, ముజఫర్‌నగర్, హనుమాన్‌గర్, నోయిడా ఈ జాబితాలో ఉ న్నాయి.
అత్యంత కాలుష్య కారక దేశంగా చాద్ నిలవగా, తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, కాంగో దేశాలు నిలిచాయి. మొ త్తంగా చూ సుకుంటే భారతీయ నగరాల్లోని 35 శాతం నగరాల్లో డబ్ల్యుహెచ్‌వో నిర్దేశించిన పీఎం 2.5 స్థాయిల కంటే 10 శాతం ఎక్కువగా నమోదైంది.