- సెమీస్‌లో లంకపై 7 వికెట్లతో గెలుపు
- ఆదివారం బంగ్లాతో టైటిల్ పోరు
షార్జా: అండర్ ఆసియా కప్‌లో యువ భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో యంగ్ ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. లక్విన్ అబెసింఘె (69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షారుజన్ షన్ముగనాథన్ (42) రాణించాడు.
భారత బౌలర్లలో చేతన్ శర్మ 3 వికెట్లు తీయగా.. కిరణ్ చోర్మలే, ఆయుశ్ హత్రే చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 21.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి గెలుపు తీరాలకు చేరింది. 13 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి చెలరేగడంతో మరో 170 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది.
లంక బౌలర్లలో విహాస్, విరన్, ప్రవీన్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అంతకముందు జరిగిన తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత పాకిస్థాన్ 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.