calender_icon.png 11 January, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో భారత్

09-10-2024 12:16:48 AM

ఆస్తానా: కజకిస్తాన్ రాజధానిలో జరుగుతున్న ఆసియా టీటీ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత జట్టు 3 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. సౌత్ కొరియా మహిళల జట్టు మొన్న జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. భారత మహిళల టీటీ జట్టులో అయికా ముఖర్జీ, మనికా బాత్రా, శ్రీజ ఆకుల ఉన్నారు. మహిళల టీటీ జట్టు సంచలన ప్రదర్శనలతో పారిస్ ఒలింపిక్స్ లో కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. కానీ పతకం తీసుకురావడంలో మాత్రం విఫలమైంది.