న్యూఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో 16 66తో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం వుమెన్ ఇన్ బ్లూ అటాక్, డిఫెన్స్ ఆటతో కట్టిపడేశారు.
చివర్లో చైత్ర సౌతాఫ్రికా ప్లేయర్ మోసియాను ఒంటిచేత్తో ఎలిమినేట్ చేసి 5 పాయింట్లు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో సెమీస్‌లో నేపాల్ 89 ఉగాండాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇక పురుషుల విభాగంలోనూ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో భారత్ 62 సౌతాఫ్రికాపై విజయాన్ని అందుకుంది. నేడు ఫైనల్స్ జరగనున్నాయి.