దంబుల్లా: మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్ నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (48 బంతుల్లో 81; 12 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు అర్ధ సెంచరీ సాధించింది. హేమలత (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించింది. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు) ధాటిగా ఆడింది.
నేపాల్ బౌలర్లలో సీతా రానా 2 వికెట్లు పడగొట్టింది. లక్ష్యచేధనలో నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులకు పరిమితమై పరాజయం చవిచూసింది. సీతా రానా (22 బంతుల్లో 18) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రాధా, అరుంధతీ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ నుంచి హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతి నివ్వగా.. స్మృతి మంధాన జట్టుకు సారథ్యం వహించింది. మరో మ్యాచ్‌లో యూఏఈపై గెలిచిన పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరింది.