29-04-2025 12:00:00 AM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం మొత్తం రగిలిపోతోంది. ఈ ఘటనపై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో రెట్రో సినిమా ప్రీరిలీజ్ వేడుక వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. పౌరుల్లో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. ‘కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలకు కారణం చదువు లేకపోవడమే.
వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్ కాకుండా చూడాలి. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బంది పడుతుంటే, వాటి సంగతి చూసుకోకుండా ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటంలేదు. పాకిస్థాన్‌పై ఇండియా దాడి చేయాల్సిన అవసరంలేదు. ఇంకొన్ని రోజుల్లో ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై తిరగబడతారు. మనం ఐక్యండా ఉండాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి.
జీవితంలో ముందుకు తీసుకెళ్లే తాళంచెవి చదువొక్కటే. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం ముందుకెళ్తుంది” అన్నారు. ‘టైమ్ ట్రావెలింగ్ మిషన్‌లో ప్రయాణించే అవకాశం వస్తే ఏం చేస్తారు?’ అని యాంకర్ సుమ అడిగినప్పుడు విజయ్.. ‘బ్రిటిష్ వాళ్లను కలుసుకొని ఒక్కటివ్వాలనుంది. మొన్ననే ఛావా సినిమా చూశా. ఔరంగజేబ్‌నూ రెండు పీకాలనుంది’ అన్నారీ రౌడీ హీరో.