కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 10: భారతదేశంలో రోడ్డు ప్రమాదాల మరణాల రేటు ఎక్కువగా ఉండటంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ భారత ప్రభుత్వ వైఫల్యమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం న్యూ ఢిల్లీలో జరిగిన సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల వార్షిక సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఈ ఏడాది జరిగిన దాదాపు 5లక్షల రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.7లక్షల మంది చనిపోగా అందులో ఎక్కువగా 18 ఏళ్లలోపు యువకులే ఉన్నారని తెలిపారు.
అవగాహనలో విఫలం..
వాహనదారులు, పాదచారులకు రోడ్లను సురక్షితంగా తీర్చిదిద్దడంలో మేం విఫలమయ్యాం. ఇది నా మంత్రిత్వ శాఖకు చీకటి సమస్య. మేం మా స్థానంలో ఉత్తమంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాం. మా తదుపరి లక్ష్యం రోడ్డు ప్రమాదాలను దాదాపు 50శాతానికి తగ్గించడమే. రోడ్డు నిర్మాణాలను చేపట్టడంతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తాం అని గడ్కరీ వెల్లడించారు. భారత్ ఎన్‌సీఏపీ ప్రాముఖ్యత గురించి గడ్కరీ సభలో ప్రస్తావించారు.