calender_icon.png 16 January, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా భారీ ఆధిక్యం

14-09-2024 02:50:07 AM

దులీప్ ట్రోఫీ

అనంతపురం: దులీప్ ట్రోఫీలో భాగం గా ఇండియా మ్యాచ్‌లో మయాంక్ కెప్టెన్సీలోని ఇండియా జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ప్రతమ్ సింగ్ (59 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (56) అర్థసెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇండియా జట్టు ప్రస్తుతం 222 పరుగుల లీడ్‌లో ఉంది.

అంతకముందు ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (92) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ శ్రేయస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకీబ్ ఖాన్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇక ఇండియా ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా జట్టు వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది.

ఓపెనర్లు అభిమన్యు (51*), జగదీశన్ (67*) అజేయ అర్థసెంచరీలు సాధిం చారు. అంతకముందు ఇండియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగులకు ఆలౌట్ అయింది. మనవ్ సుతార్ (82) ఆకట్టుకున్నాడు. ఇండియా బౌలర్లలో ముకేశ్, రాహుల్ చెరో 4 వికెట్లు తీశారు.