calender_icon.png 6 October, 2024 | 1:48 PM

ఈ ఏడాది భారత్ వృద్ధి 7 శాతం

04-09-2024 12:00:00 AM

  1. అంచనాల్ని పెంచిన ప్రపంచ బ్యాంక్ 
  2. వ్యవసాయ రంగం మద్దతు 
  3. 2027 వరకూ ఇదే జోరు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ పెంచింది. వ్యవసాయ రంగం కోలుకుంటున్నందున, గ్రామీణ డిమాండ్ పెరుగుతున్నం దున భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  జూన్ నెలలో ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన 6.6 శాతం అంచనాల్ని గణనీయంగా 40 బేసిస్ పాయింట్ల మేర పెంచడం గమనార్హం.

తాజా ప్రపంచ బ్యాంక్ అంచనా ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), ఆసియ న్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వెల్లడించిన అంచనాలకు సమానంగా ఉన్నది. ఈ రెండు ఏజెన్సీలు 2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి అంచనా ల్ని 7 శాతానికి పెంచాయి. జూలైలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో 20 24 సంవత్సరానికి 6.57 శాతం వృద్ధిని అంచనా వేయగా, రిజర్వ్‌బ్యాంక్ 7.2 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నది. 

రుణ నిష్పత్తి తగ్గుదల

ప్రభుత్వ రెవిన్యూ వృద్ధి, ఆర్థిక స్థిరత్వం కారణంగా జీడీపీతో పోలిస్తే భారత్ రుణ నిష్పత్తి 2027కల్లా 82 శాతానికి తగ్గుతుంద ని అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 83.9 శాతం. ఒక వైపు వృద్ధి పుంజుకోవడం, మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్ట డం పేదరికం తగ్గడానికి దోహదపడుతుందని వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ఆగస్టే టానో కువమే తెలిపారు. 

ఎగుమతులు పెంచుకోవాలి

అంతర్జాతీయ వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకోవడం ద్వారా భారత్ వృద్ధిని మరింత పెంచుకోగలుగుతుందని చెప్పారు. ఇండియాకు పట్టు ఉన్న ఐటీ, బిజినెస్ సర్వీసులు, ఫార్మా రంగాలకు తోడు, టెక్స్‌టైల్స్, అప్పారెల్, ఫుట్‌వేర్ రంగాలు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్నాలజీ ఉత్పత్తులపై దృష్టినిలిపి ఎగుమతులు పెంచుకోవాలని సూచించారు. 2030 కల్లా 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతు ల లక్ష్యాన్ని చేరుకోవడాని భారత తన ఎగుమతుల బాస్కెట్‌ను వివిధీకరించుకోవాలని కోరింది. 

రుతుపవనాల మెరుగుదల

రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, ప్రైవే టు వినియోగం, ఎగుమతులు పెరుగుతుండటంతో తాము జీడీపీ వృద్ధి అం చనాల్ని పెంచినట్టు వరల్డ్  బ్యాంక్ సీనియర్ ఎకానమిస్ట్ రాన్ లీ చెప్పారు. పారి శ్రామిక రంగం మందకొడితనాన్ని కొంతవరకూ వ్యవసాయ రంగం పూడుస్తుంద ని, సర్వీసుల రంగం జోరు కొనసాగుతుందని బ్యాంక్ అంచనా వేస్తున్నామన్నారు. దక్షిణాసియా ప్రాంతపు ఆర్థిక వృద్ధిలో అధికభాగం ఇండియాదేనని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన అప్‌డేట్‌లో పేర్కొంది. సవాళ్లతో కూడుకున్న అంతర్జాతీయ పరిస్థితుల నడుమ భారత్ మధ్యకాలిక వృద్ధి పాజిటివ్‌గా ఉంటుందని, 2026, 2027 ఆర్థిక సంవత్సరాల్లో సైతం వృద్ధి పటిష్టంగా ఉంటుం దని ప్రపంచ బ్యాంక్ వివరించింది.