calender_icon.png 10 October, 2024 | 11:56 PM

భారత జీడీపీ వృద్ధి 7.10 శాతం

27-08-2024 12:00:00 AM

ఆర్‌బీఐ రీసెర్చ్ అంచనా

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 7.10 శాతం వృద్ధి చెందుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య విధాన సమావేశంలో 202425 మొత్తం ఆర్థిక సంవత్సరం జీడీపీ వద్ధి 7.20 శాతంగా అంచనా వేసింది. అయితే మొదటి త్రైమాసికం జీడీపీ డేటా శుక్రవారం విడుదల కానుంది.  ఎస్‌బీఐ రీసెర్చ్ గ్రూపు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతిఘోష్ రాసిన తన తాజా ఎకోవ్రాప్ నివేదికలో పె రుగుతున్న ప్రపంచ సరకు రవాణా, కంటైనర్ ఖర్చులు, సెమీ కండక్టర్ల కొరత సహా అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగానే ఉందని పేర్కొంది. జులైలో అంతర్జాతీయ ద్రవ్యనిధి( ఐఎంఎఫ్)2024 భారత ఆర్థిక వృద్ధి అంచనాలను 6.8 శాతంనుంచి 7 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.