యూఎన్ అంచనా
న్యూఢిల్లీ, జనవరి 10: భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.6 శాతం వృద్ధిచెందుతుందని యునైటెడ్ నేష న్స్ (యూఎన్) తాజా నివేదిలో అం చనా వేసింది. వినియోగం, పెట్టుబడులు, సర్వీసులు, ఉత్పత్తుల ఎగుమ తుల పటిష్ఠత ఇందుకు కారణమని వివరించింది. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ మౌలిక సదుపాయాల రంగంపై దృష్టిపెట్టడం, ఎగు మతుల్లో వృద్ధి సాధిస్తున్నందున, ఆర్థికాభివృద్ధి మెరుగ్గా ఉంటుందని అంచనా వేసింది.
దక్షిణాసియా ఆర్థికాభివృద్ధిపై యునైటెడ్ నేషన్స్ ఒక నివేదిక విడుదల చేసింది. భారత్ ‘పటిష్ఠ పనితీరు’ కారణంగా మొత్తం దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ జోరు చూపిస్తుందని పేర్కొంది. భారత్‌తో పాటు శ్రీలంక, భూటాన్, నేపాల్ తదితర దేశాల వృద్ధి మద్దతుతో దక్షిణాసియా ప్రాంతం 2025లో 5.7 శాతం, 2026లో 6 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని అంచనా వేసిం ది.
భారత్ 2024లో 6.8 శాతం వృద్ధిచెందిందని, 2025లో 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని, తిరిగి 2026లో 6.8 శాతం వృద్ధిబాటలోకి ప్రవేశిస్తుందని యూఎన్ రిపోర్ట్‌లో వివరించింది. ఈ ఏడాది భారత్‌లో ద్రవ్యోల్బణం 4.3 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది.