11-04-2025 01:46:47 AM
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణా (64)ను ఎట్టకేలకు ఎన్‌ఐఏ భారత్‌కు రప్పించింది. అమెరికా అనుమతితో ప్రత్యేక విమానంలో గురువారం సాయం త్రం 6.30కు ఢిల్లీకి తీసుకొచ్చింది. అనంతరం ఎన్‌ఐఏ అధికారులు యాంటీ టెర్రర్ యాక్ట్ కింద రాణాను అరెస్ట్ చేసి..
పటియాలా హౌస్ కోర్టులోని స్పెషల్ ఎన్‌ఐఏ జడ్జి ఎదుట హాజరుపరిచారు. రాణా ను 20 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించాలని న్యాయవాదులు కోరారు. అందుకు సంబంధించి పలు ఆధారాలు కోర్టుకు సమర్పించగా.. కోర్టు ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. 2008 ముంబై హోటల్‌పై దాడి ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
2011లోనే రాణాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చార్జ్‌షీట్ నమోదు చేసినప్పటికీ అతడిని భారత్‌కు తీసుకొచ్చేం దుకు 14 ఏండ్లు పట్టింది. అమెరికా తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు అవకాశం ఉన్న అన్ని న్యా యమార్గాలను రాణా వినియోగించుకున్నా డు. ఇక చివరికి అమెరికా సుప్రీం కోర్టు తీ ర్పుతో రాణా భారత్‌కు బందీగా రాక తప్పలేదు. రాణాను అమెరికా ప్రభుత్వం భారత్ కు అప్పగించడంలో దౌత్యపరమైన విజ
య ం దక్కింది. తహవూర్ రాణాను అక్టోబర్ 2009లో చికాగోలో అరెస్ట్ చేశారు. 2008 ముంబై దాడుల అనంతరం పోలీసులు ఫైల్ చేసిన మొదటి చార్జ్ షీట్‌లో రాణా పేరు లేదు. ఈ కేసులో 2011లో ఎన్‌ఐఏ తహవూర్ రాణా పేరును చేర్చింది. హెడ్లీ, రాణా చిన్ననాటి స్నేహితులు. 2016 లో ముంబైలోని స్పెషల్ కోర్టులో హెడ్లీ తన వాంగ్మూలంలో రాణా పాత్రను బయటపెట్టాడు. నేర పూరిత కుట్ర, భారత ప్రభుత్వా నికి వ్యతిరేకంగా వ్యవహరించడం, హత్య, చట్టవ్యతిరేక కార్యకలాపాల కింద అభియోగాలున్నాయి.
ధ్రువీకరించిన ఎన్‌ఐఏ..
రాణాను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ ధ్రువీకరించింది. లాస్ ఏంజిల్స్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చినట్టు పేర్కొం ది. ‘ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ, భారత విదేశాంగ శాఖ, హోం శాఖ, యూఎన్‌డీఓజే, యూఎస్ స్కై మార్షల్, అమెరికాలోని అధికారుల స మన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది’ అని పేర్కొంది.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్
తహవూర్ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యే వరకు ఈయన ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించనున్నారు. సీనియర్ క్రిమినల్ లాయర్ దయన్ క్రిష్ణన్ ప్రాసిక్యూషన్ టీమ్‌కు హెడ్‌గా వ్యవహరించనున్నారు.
కుంభమేళాలో విధ్వంసానికి కుట్ర!
ముంబై ఉగ్రదాడులకు ప్రణాళిక వేసి పక్కాగా అమలు చేసిన రాణా, మరెన్నో ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కూడా వ్యూహాలు రచించాడు. ‘రాణా మరెన్నో ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రచించా డు. హరిద్వార్‌లో జరిగే కుంభమేళా, రాజస్థాన్‌లో జరిగే పుష్కర్ మేళా, కొచ్చి ప్రాంతా ల్లో దాడులకు ప్రణాళికలు వేశాడు.
అందుకోసం కొంత మందిని కూడా నియ మించుకున్నాడు.’ అని ఎన్‌ఐఏ మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లోకనాథ్ బెహరా తెలిపారు. ముంబైలో నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఉండే జల్ వాయు విహార్ కాలనీని కూడా రాణా లక్ష్యంగా చేసుకున్నట్టు జర్నలిస్ట్ ఉన్నిథన్ పేర్కొన్నారు.
కేవలం 12 మందికి మాత్రమే అనుమతి
ఢిల్లీకి చేరుకున్న రాణా కోసం ఎన్‌ఐఏ హై సెక్యూరిటీ సెల్‌ను ఏర్పాటు చేసింది. అతడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్‌లోకి కేవలం 12 మంది అధికారులు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది.
రాణా పాక్ పౌరుడు కాదు..
రాణాకు పాకిస్తాన్‌తో సంబంధమేమీ లేదని పాక్ ప్రకటించింది. రాణా పాక్ పౌ రుడే కాదంది. ‘రాణా గడిచిన రెండు దశాబ్దాల నుంచి అతడి పాకిస్తానీ పత్రాలను పునరుద్ధరించుకోలేదు. అతడి కెనడా పౌరసత్వం స్పష్టంగా ఉంది.’ అని పాకిస్తాన్ ఫారిన్ ఆఫీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.