calender_icon.png 20 January, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్చరీలో భారత్‌కు నిరాశ

01-09-2024 12:04:16 AM

క్వార్టర్స్‌లో సరిత, ప్రిక్వార్టర్స్‌లో శీతల్ ఓటమి

పారిస్: పారాలింపిక్స్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా ఆర్చర్లు శీతల్ దేవి, సరితా కుమారి నిరాశపరిచారు. మహిళల పారా ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో సరిత కేవలం క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో సరిత 143 తేడాతో తుర్కియేకు చెందిన గిర్డీ నుర్ చేతిలో రెండు పాయింట్ల తేడాతో పరాజయం చవిచూసింది.  అంతకముందు  సరితా కుమారి ప్రిక్వార్టర్స్‌లో 141 తేడాతో ఇటలీ పారా ఆర్చర్ సర్తి ఎలొనోరాను చిత్తుగా ఓడించింది. అయితే అదే జోరును క్వార్టర్స్‌లో చూపడంలో సరిత విఫలమైంది.

టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన మరో భారత ఆర్చర్ శీతల్ దేవి పారిస్‌లో మాత్రం ప్రిక్వార్టర్స్‌కే పరిమితమైంది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శీతల్ 137 తేడాతో చైనా ఆర్చర్ జునిగా మరియానా చేతిలో ఓటమి చవిచూసింది. తొలి సెట్‌లో 29 స్కోరు చేసిన శీతల్ ఆ తర్వాత 26, 27, 29, 26 స్కోర్లు నమోదు చేసింది. అయితే అదే సమయంలో మారియానా మొదటి నాలుగు సెట్లలో శీతల్ కంటే వెనుకంజలో ఉంది. అయితే చివరి సెట్‌లో శీతల్ రెండుసార్లు 8 పాయింట్లు స్కోరు చేయగా.. మారియానా మాత్రం 9, 10,8 పాయింట్లతో మొత్తంగా 27 స్కోరు చేసి ఒక్క పాయింట్ తేడాతో విజయాన్ని అందుకుంది.