calender_icon.png 16 January, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిక్వార్టర్స్‌లో భారత్ ఓటమి

07-08-2024 03:21:54 AM

పారిస్: ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో భారత ప్యాడర్లు నిరాశ పరిచారు. టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలో భారత్ ప్రిక్వార్టర్స్‌కే పరిమితమైంది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఆచంట శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ థక్కర్‌లతో కూడిన భారత్ 0 చైనా చేతిలో పరాజయం చవిచూసింది. తొలుత హర్మీత్ దేశాయ్ థక్కర్ జోడీ 2 3 7 చైనా జోడీ మా లాంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. ఆ తర్వాత సింగిల్స్‌లో శరత్ కమల్ 11 7 7 5 ఫ్యాన్ జెండాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం రెండో సింగిల్స్‌లో మానవ్ థక్కర్ కూడా నిరాశపరిచాడు.  హుకిన్ చేతిలో 11 11 11 వరుస గేముల్లో మానవ్ ఓటమి పాలవ్వడంతో భారత్ పరాజయం ఖారారైంది.