calender_icon.png 21 February, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ పరాజయం

29-01-2025 12:40:55 AM

  • మూడో టీ20లో ఇంగ్లండ్ గెలుపు
  • వరుణ్ చక్రవర్తికి ఐదు వికెట్లు

రాజ్‌కోట్: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది.  రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ (51) అర్థసెంచరీ చేయగా.. లివింగ్‌స్టోన్ (24 బంతుల్లో 43) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో మెరవగా.. పాండ్యా 2 వికెట్లు తీశాడు.

బ్యాటర్ల విఫలం..

172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. టాపార్డర్‌లో శాంసన్ (3), అభిషేక్ (24), సూర్యకుమార్ (14) నిరాశపరిచారు. గత మ్యాచ్ హీరో తిలక్ వర్మ (18) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా..

పాండ్యా (40) ఆశలు రేపినా మిగతావాళ్లు విఫలం కావడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ మూడు వికెట్లు తీయగా.. ఆర్చర్, కారస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2 తగ్గించింది. శుక్రవారం నాలుగో టీ20 జరగనుంది.