calender_icon.png 23 December, 2024 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లో లెక్క తేలింది

03-11-2024 12:51:40 AM

ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ ఖరారు

న్యూఢిల్లీ, నవంబర్ 2: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జార్ఖండ్‌లో ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ ఖరారైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా సీఎం హేమంత్‌సోరెన్ నేతృత్వంలోని జార్ఖ ండ్ ముక్తి మోర్చా 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30 స్థానా ల్లో పోటీకి దిగుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ౬, వామపక్షాలు ౪ స్థానాల్లో పోటీకి సిద్ధం అయ్యా యి. ధన్వర్, బిష్రాంపూర్, ఛతర్‌పూర్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని జేఎంఎం నేత వినోద్ పాండే తెలిపారు. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.