calender_icon.png 28 December, 2024 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ చేతిలో విండీస్ క్లీన్‌స్వీప్

28-12-2024 01:13:30 AM

మూడో వన్డేలో హర్మన్ సేన విక్టరీ

వడోదర: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం వడోదర వేదికగా జరిగిన మూడో వన్డేలో హర్మన్ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. చిన్నెల్లె  హెన్రీ (61) అర్థసెంచరీతో రాణించగా.. షెమెయిన్ (46) పర్వాలేదనిపించింది.

  భారత బౌలర్లలో దీప్తి శర్మ 6 వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు మంధాన (4), ప్రతికా రావల్ (18) తొందరగానే వెనుదిరిగినప్పటికీ మిడిలార్డర్‌లో హర్మన్ ప్రీత్ (32), రోడ్రిగ్స్ (29), దీప్తి శర్మ (39 నాటౌట్), రిచా ఘోష్ (23 నాటౌట్) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన తో అదగొట్టిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, రేణుకా సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ సొంతం చేసుకుంది.