calender_icon.png 31 October, 2024 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌..చైనా భాయ్ భాయ్

31-10-2024 12:00:00 AM

భారత్‌చైనా మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. తూర్పు లడఖ్‌లోని కీలక పోస్టులయిన డెప్సాంగ్, డెమ్‌చోక్‌లనుంచి రెండు దేశాల సైన్యాలు పూర్తిగా వైదొలగినట్లు భారత సైనిక వర్గాలు బుధవారం ప్రకటించాయి. ఇక సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే కొనసాగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.ఈ చర్య రెండు దేశాల మధ్య శాంతియుగానికి నాందిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరుదేశాల సేనలు పరస్పరం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

సాధారణ పెట్రోలింగ్‌కు సంబంధించిన విధి విధానాలతో పాటుగా ఇతర అంశాలపై ఇరుదేశాల మధ్య కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతాయని కూడా ఆ వర్గాలు తెలిపాయి. వారం రోజుల క్రితం ఇరు దేశాల మధ్య గస్తీ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం ఈ నెల 29లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. అంతేకాదు 2020 నాటి యథాతథ స్థితిని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కొనసాగించాలని నిర్ణయించారు.

ఒప్పందంలో భాగంగా కీలక ప్రాంతాలనుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని తీసుకుని వెనక్కి వెళ్లినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా అక్కడ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దులకు ఇరు వైపులా 1012 తాత్కాలిక నిర్మాణాలు, టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

2020 జూన్ 15న తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్‌చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త ప రిస్థితులకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనాకూడా భారీగా సైనికులను కోల్పోయింది.

కానీ డ్రాగన్ ఆ విషయాన్ని దాచిపెట్టింది. చాలానెలల తర్వాత ఐదుగురు చనిపోయినట్లు అధికారికంగా అంగీకరించింది. ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల ఎల్‌ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించడం జరిగింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్వస్థితిని పునరుద్ధరించడంపై ఇరు దేశాల మధ్య దౌత్య, కమాండర్ స్థాయిలో అనేక దఫాలు చర్చలు జరిగాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాలనుంచి బలగాల ఉపసంహరణ జరిగింది.

కానీ ఘర్షణలకు కేంద్రయిన డెమ్‌చోక్, డెప్సాంగ్‌ల వద్ద మాత్రం బలగాలు కొనసాగుతున్నాయి. అ యితే గత వారం రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర స మావేశంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సందర్భంగా ఇ రుదేశాల మధ్య గస్తీ ఒప్పందంపై ప్రకటన వెలువడ్డం గమనార్హం. ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమావేశమైన ఇరువురు నేతలు గస్తీ ఒప్పందానికి ఆమోదం తెలి పినట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ, ప్రపంచ శాంతికి రెండు దేశాల మధ్య స్థిరమైన, సహృద్భావ ద్వైపాక్షిక సంబంధాలు అవసరమని  వారు అభి ప్రాయపడ్డారు.  కాగా భారత్‌చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతల తగ్గింపును అమెరికా సైతం స్వాగతించింది. పరిస్థితిని వాషింగ్టన్ నిశితంగా పరి శీలిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే ఒప్పందం వి షయంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా రెండు దేశాల మధ్య నాలుగేళ్లుగా ఉద్రిక్తతల కారణంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు సైతం ఆటంకం ఏర్పడింది. ఇది నిజంగా సానుకూల పరిణామమమని, శాశ్వత స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.