calender_icon.png 31 October, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్

30-07-2024 01:51:36 AM

  1. ప్రమోటర్ల నుంచి 32.72% వాటా
  2. కొనుగోలుకు రూ.3,954 కోట్లతో ఒప్పందం

న్యూఢిల్లీ: వేగంగా విస్తరిస్తున్న దక్షిణాది సిమెంట్ మార్కెట్లో, ముఖ్యంగా తమిళనాడులో తమ పట్టును మరింత పెంచుకునేందుకు ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) సంస్థ ప్రమోటర్లతోపాటు వారి అసోసియేట్ల నుంచి 32.72% వాటాను కొనుగోలు చేసేందుకు రూ.3,954 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీనితోపాటు ఐసీఎల్ ర్ హోల్డర్ల నుంచి మరో 26శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.3,142.35 కోట్ల ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది.

దేశంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థల్లో రెండవదిగా ఉన్న అదానీ గ్రూపు రూ.10,422 కోట్లతో హైదరాబాద్‌క్కు చెందిన పెన్నా సిమెంట్ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన నెల తర్వాత అల్ట్రాటెక్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. పెన్నా కంపెనీని కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం 14 మిలియన్ టన్నులు పెరిగి 93 మిలియన్ టన్నులకు చేరుతుంది. కాగా, అల్ట్రాటెక్ 154.86 మిలియన్ టన్నుల స్థాపిత సామర్థ్యంతో గ్రే సిమెంట్‌ను తయారు చేస్తోంది.