అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండొలిజా రైస్
న్యూయార్క్, సెప్టెంబర్ 10: చైనా అధినేత జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఉన్న బలమైన బంధంపై భారత ప్రధాని నరేంద్రమోదీకి పూర్తి అవగాహన ఉందని, భారత్‌ను ప్రతీసారి అనుమానించాల్సిన అవసరం లేదని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండొలిజా రైస్ అభిప్రాయపడ్డారు. ఇండస్ ఎక్స్ (ఇండియా డిఫెన్స్ యాక్సలెరేషన్ ఎకోసిస్టమ్) సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో చైనా బలమైన బంధం భారత్‌ను ఇరుకున పెడుతుందన్నారు. భారత్ బంధం బలపడుతోందని.. ఈ మేరకు రెండు వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత్ చెబుతున్నట్లు చాలా దేశాలు వ్యూహాత్మక స్వేచ్ఛ (స్ట్రాటజిక్ అటానమీ)ని కోరుకుంటున్నాయని, దాంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.