21-03-2025 12:22:48 AM
వెల్లడించిన క్రీడామంత్రిత్వ శాఖ వర్గాలు
న్యూఢిల్లీ, మార్చి 20: 2030లో జరగబోయే కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం భారత్ బిడ్ వేసింది. అహ్మదాబాద్‌లో ఈ గేమ్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించాలని తహతహలాడుతోంది. క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ‘2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడమే భారత లక్ష్యం. మా మెయిన్ టార్గెట్ 2036 ఒలింపిక్స్’ అని తెలిపారు. 2010లో భారత్‌లో ఢిల్లీ వేదికగా కామన్‌వెల్త్ క్రీడలు జరిగాయి. ఈ 2030 క్రీడల కోసం క్రీడామంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌ను ఎంచుకుంది.