calender_icon.png 25 November, 2024 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: తొలి టెస్టులో భారత్ ఘన విజయం

25-11-2024 01:38:00 PM

టీమిండియాదే పెర్త్ టెస్టు.. 

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా శుభారంభం ఇచ్చింది. పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల తేడాతో ఆసీస్ ను భారత ఆటగాళ్లు మట్టికరిపించారు. 534 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఆసీస్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టీ బ్రేక్ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన నాథన్ లైయన్(0)ను వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 227 పరుగుల వద్ద ఆసీస్ 9 వికెట్ డౌన్ అయింది.  భారత్ తొలి ఇన్నింగ్స్ లో 150, రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టపోయి 487 డిక్లేర్డ్ చేసింది. అటు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 104, రెండో ఇన్నింగ్స్ లో 238 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచు గెలిపించడంతో బుమ్రా కీలక పాత్రపోషించాడు. బుమ్రా కెప్టెన్ గా బాధ్యత చేపట్టిన ఈ తొలి టెస్టులో ఓపెనర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పలు రికార్డులు నమోదు చేశాడు.