చెన్నై: ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్ లో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ తొలి టెస్టు కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన జట్టు సభ్యులు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ లతో కలిసి బంగ్లాతో టెస్టు కోసం తాజాగా చెన్నైకి చేరుకున్నారు. కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లతో విమానాశ్రయాన్ని అధికారులు సమాయాత్తం చేశారు.బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా,వికెట్ కీపర్, బాటర్.. రిషబ్ పంత్ లు తమ సత్తా చూపించి అభిమానులను అలరించడానికి నెల రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్నారు.