calender_icon.png 3 February, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్-19 ఉమెన్స్ క్రికెట్ విశ్వ విజేతలుగా భారత్..

02-02-2025 08:59:41 PM

భద్రాద్రి జిల్లా వాసి గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్...

జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ...

పాల్వంచ (విజయక్రాంతి): ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ బస్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా మార్కెట్ కు చేరి తిరిగి బస్టాండ్ వరకు అండర్-19 ఉమెన్స్ క్రికెట్ విజయోత్సవ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒలంపిక్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. అండర్-19 క్రికెట్ విశ్వ విజేతలుగా భారత్ గెలుపుకు కారకురాలైన మన తెలుగు తేజం, భద్రాద్రి జిల్లా వాసి గొంగడి త్రిష 3-15, 44 తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోవడం చాలా సంతోషమని, ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా అవలీలగా భారత్ జట్టును గెలిపించడంపై ముఖ్య పాత్ర పోషించిందని, గెలుపు అనంతరం త్రిష తండ్రి రామ్ రెడ్డికి చరవాణి ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది.

అనంతరం బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. రామ్ రెడ్డి కూడా ఒక టెన్నిస్ క్రీడాకారుడుగా, తన పిల్లలకి క్రీడా స్ఫూర్తి నింపి దేశానికి గొప్ప పేరు తేవాలని తన కోరిక నెరవేరిందని తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా టిఆర్వికెఎస్ రాష్ట్ర కార్యదర్శి చారుగుండ్ల రమేష్, టేకుల సంతోష్ రెడ్డి, నరసింహ, చింతా నాగరాజు, సందుభట్ల శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, కబీర్, వంశీ, మనోజ్, విగ్నేష్, రామ్మోహన్ రెడ్డి పాల్వంచ టెన్నిస్ అసోసియేషన్ యువ క్రీడాకారులు పాల్గొన్నారు.