calender_icon.png 6 February, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్‌తో అభివృద్ధి చెందిన దేశంగా భారత్

06-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): వికసిత్ భారత్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసినట్లయితే భారతదేశం అభి వృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఎలాంటి సందేహం లేదని శాతవాహన విశ్వ విద్యాలయ పూర్వ ఉపకులపతి టి చిరంజీ వులు అన్నారు.

శాతవాహన విశ్వవిద్యాల యంలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వరలో వికసి త్ భారత్-2047, ఇండియా విజన్ ఫర్ డెవ లప్మెంట్ అనే అంశంపై రెండు రోజుల జాతీ య సదస్సు బుధవారం ముగిసింది.

ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీ వులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన ప్పటి నుంచి భారతదేశం సాధించిన విజ యాలను గుర్తించాలని, భారత ఆర్ధిక వ్యవస్థ ఎన్నో సమస్యలకు పరిష్కారాలను సూచిం చిందని అన్నారు.

విశ్వవిద్యాలయ ఉపకుల పతి ఉమేష్ కుమార్ మాట్లాడుతూ తాను వీసీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి కార్య క్రమాలు చేశానని, విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్, న్యాయ, ఎంఫార్మసీ కోర్సు లకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకు వచ్చానని,

ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. ఆడిటోరియాన్ని డిజిటల్ ఆడిటోరియంగా, శాతవాహన విశ్వవిద్యాలయాన్ని రాష్ర్టం లోనే అన్ని విశ్వవిద్యాలయాల్లోకెల్లా మొదటి స్థానంలో ఉంచుతానని, వికసిత్ శాతవాహ నగా అభివృద్ధి చేస్తానని అన్నారు.

సెమినార్ డైరెక్టర్, అర్ధవాస్త్ర విభాగం హెచ్వోడి డాక్టర్ కోడూరి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రవికుమార్ శాస్త్రి, ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, విసిఓఎస్ డాక్టర్ డి హరికాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరే పల్లి సుజాత, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం వరప్రసాద్,

యూజీసీ అఫైర్స్, ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మావతి, డాక్టర్ మహ్మద్ జాఫర్ జరీ, డాక్టర్ అబ్రహం బాకీ, డాక్టర్ బేగం, డాక్టర్ మునావర్, విద్యాసాగర్, కను కయ్య, డాక్టర్ తిరుపతి, డాక్టర్ ఫాతిమా సు ల్తానా బేగం, డాక్టర్ జమున, వెంకటేష్, విశ్వ విద్యాలయ అధ్యాపకులు, పరిశోధన విద్యా ర్థులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.