24-03-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మార్చి 23: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన సతీమణి ప్రీతి చోక్సీతో కలిసి ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే మెహుల్ చోక్సీని తమకు అప్పగించాలంటూ బెల్జియం అధికారులను భారత్ కోరినట్టుగా అందులో వెల్లడించింది. ప్రీతి బెల్జియం పౌరురాలు కావడంతో భారత్‌కు దొరక్కుండా ఉండేందుకు చోక్సీ తప్పు డు ధ్రువపత్రాలతో ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డు’ను పొంది తన భార్యతో కలిసి ఆంట్వేర్ప్ ప్రాం తంలో నివాసం ఉంటున్నట్టు తెలిపింది. అంతేకాకుండా క్యాన్సర్ చికిత్స పేరుతో అతడు స్విట్జర్లాండ్‌కు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా తన కథనాల్లో తెలిపింది.