ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలయ్యింది. మంగళవారం దుబాయ్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న షురూ కానున్న చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. తొలుత టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. భారత్ ఆడేందుకు నిరాకరించడంతో ఐసీసీ హైబ్రీడ్ మోడ్‌ను ప్రతిపా దించింది.
ఈ మేరకు హైబ్రీడ్ మోడ్‌లో జరగనున్న టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనుంది. వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్ నిలిచిన జట్ల మధ్య చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. గ్రూప్ భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ ఉన్నాయి.
ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. తొలి సెమీఫైనల్‌కు దుబాయ్ వేదిక కానుండగా.. రెండో సెమీస్ లాహోర్‌లో జరగనుంది. మార్చి 9న జరగనున్న ఫైనల్‌కు లాహోర్ ఆతిథ్యమి వ్వనుండగా.. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే మాత్రం టైటిల్ పోరుకు దుబాయ్ వేదిక కానుంది. రెండు గ్రూపుల్లో నుంచి టాప్ నిలిచిన జట్లు సెమీస్ ఆడనున్నాయి.
అందరి కళ్లు ఆ మ్యాచ్‌పైనే..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరగనున్న దాయాదుల మ్యాచ్‌పై అందరి కళ్లు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతి నడంతో ఐసీసీ టోర్నీల్లో మినహా భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, పాకిస్థాన్ చివరిసారిగా ఆడగా.. రోహిత్ సేన పైచేయి సాధించింది. ఇక గ్రూప్ ఉన్న భారత్ తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో (ఫిబ్రవరి 20న), ఫిబ్రవరి 23న దాయాది పాక్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది.