calender_icon.png 21 December, 2024 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు భారత్, పాక్ పోరు

19-07-2024 12:14:16 AM

  • మహిళల ఆసియా కప్

డంబుల్లా: టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న మహిళల ఆసియా కప్ నేటి నుంచి షురూ కానుంది. శ్రీలంక వేదికగా జరగనున్న టోర్నీలో గ్రూప్ ఏ నుంచి తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు నాలుగుసార్లు తలపడితే.. టీ20 ఫార్మాట్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియాదే విజయం. ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1 డ్రా చేసుకున్న హర్మన్ సేన పాక్‌తో పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.