calender_icon.png 5 January, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు భారత్, బంగ్లా మ్యాచ్

12-10-2024 02:46:09 AM

  1. ఉప్పల్ స్టేడియంలో పకడ్బందీ ఏర్పాట్లు
  2. 2,600 మంది పోలీసుల పహారా
  3. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా శనివారం జరగనున్న భారత్ టీ20 మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని విభాగాలు కలిపి మొత్తం 2,600 మంది పోలీసులు విధుల్లో ఉంటారని, అలాగే స్టేడియం పరిసరాల్లో 300 సీసీ కెమెరాలను ఏర్పా టు చేసినట్లు శుక్రవారం తెలిపారు.

స్టేడియానికి వచ్చే వీక్షకులు ల్యాప్‌టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటి ళ్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మ్యాచ్‌బాక్స్ వంటివి తీసుకురావొద్దని సూచించారు. మ్యాచ్ పూర్తయ్యాక తిరిగి వెళ్లేందుకు అర్ధ రాత్రి 1 గంట వరకు మెట్రో నడపనున్నారని సీపీ పేర్కొన్నారు.