* కలిసి ఉండనప్పుడు కూటమి ఎందుకు?
* కూటమికి జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సూటి ప్రశ్న
* కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలు తలెత్తడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ, జనవరి 9: ప్రతిపక్షాలు ఐక్యంగా లేనందున ఇండియా కూటమి రద్దు చేయాలంటూ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య బెధాలు తలెత్తడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మీడియాతో ఆయన గురువారం మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఐక్యతను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూటమి భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి సమావేశం జరగకపోవడం దురదృష్టకరమన్నారు.
కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఎజెండా ఏమిటి? కూటమి ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై చర్చ జరగలేదన్నారు. కూటమి ఐక్యంగా ఉందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదన్నారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత కూటమి సమావేశమై దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఒక వేళ లోక్‌సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడితే.. ఇక పొత్తుకు స్వస్తి పలకాలన్నారు. అలాకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలంటే కలసికట్టుగా ఉండలన్నారు.
దీనిపై చర్చలు జరిపి ఒక స్పష్టతకు రావాలన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా ఉండేందుకు కూటమి శక్తికి మించి కృషి చేసిందని ఈ సందర్భంగా అబ్దుల్లా అన్నారు. అంతకు ముందు ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ఇండియా కూటమికి ప్రస్తుతం ప్రాముఖ్యత లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడిందన్నారు.
కూటమి నిర్ణయించలేదు
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందించారు. కూటమిలోని పార్టీల అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఏం చేయాలనేది ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు నిర్ణయించలేవన్నారు.
ఆప్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ విమర్శలు
ఢిల్లీలో పోటీ బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్యే ఉందని తాజాగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలతో ఇండియా కూటమికి సంబంధం లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకు ముం దు ఆప్ హామీలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ మోసం చేస్తున్నారంటూ పోలీసులకు ఫి ర్యాదు చేసింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేసిన కేజ్రీవాల్.. కూటమి నుంచి కాంగ్రెస్‌ను బహిష్కరించే విషయంపై మిత్రపక్షాలతో చర్చిస్తానన్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలోని దాదాపు అన్ని పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.