దెబ్బతీసిన బ్యాంకింగ్, ఆటో షేర్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఆటో షేర్లు అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు సూచీలను పడేశాయి.
సెన్సెక్స్ ఉదయం 78,637.58 పా యింట్ల వద్ద (క్రితం ముగింపు 78,699.07) ఫ్లాట్‌గాప్రారంభమైంది. 11 గంటల సమయంలో లాభాల్లోకి వెళ్లిన సూచీ.. 79,092 వద్ద గరిష్ఠాన్ని తాకింది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 78,077.13 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 450.94 పాయింట్ల నష్టంతో 78,248.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 168.50 పాయింట్ల నష్టంతో 23,664.90 వద్ద స్థిరపడింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 4 పైసలు క్షీణించి 85.52గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టై టాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. జొమాటో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ 73.98 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2625 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.