ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించా యి. రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచా యి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరోవైపు హెచ్ డీఎఫ్‌సీ, ఐటీ స్టాక్స్ సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగియగా.. నిఫ్టీ 24,650 దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,602.58 (క్రితం ముగింపు 81,709.12) పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది.
రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 81,411. 55 - 81,783.28 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 200.66 పాయింట్ల నష్టంతో 81,508.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 58.80 పాయింట్ల నష్టంతో 24,619 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించి 84. 74 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటా ర్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయిం ట్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్‌షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కె ట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.93 డా లర్ల వద్ద ట్రేడవుతుండగా బంగారం ఔన్సు 2679 డాలర్ల వద్ద కొనసాగుతోంది.