కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సీనియర్ హాస్య నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్ పోషించిన చిత్రం ‘బాపు’. ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందింది. బలగం సుధాకర్‌రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదిత రులు ప్రధాన పాత్రల్లో నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు దయా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రాజు, సీహెచ్ భాను ప్రసాద్‌రెడ్డి నిర్మించారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు విశ్వక్‌సేన్, నిర్మాత మధుర శ్రీధర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ సినిమా కూడా ఇండిపెండెంట్ సినిమా.
ఇలాంటి సినిమా సక్సెస్ అయితేనే మేకర్స్‌కు ఉత్సాహం వస్తుంది’ అన్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ దయ చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చింది. బడ్జెట్ సమస్య ఉన్నా కూడా అధిగమించి సినిమా చేశాం. ఇప్పుడు క్యారవ్యాన్ లేకపోతే చిన్న ఆర్టిస్టులు కూడా రావట్లేదు. కానీ ఈ సినిమాకు ఎవరూ క్యారవ్యాన్ వాడలేదు. కరీంనగర్‌లో ఒక విలేజ్‌లో షూటింగ్ చేశాం.
ఇదొక డిఫరెంట్ స్టోరీ’ అని చెప్పారు. ఆమని మాట్లాడుతూ.. ‘ఇందులో కథే హీరో. మేమంతా చాలా ఇన్వాల్వ్ అయి చేశాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది’ అన్నారు. దయ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగుంటుంది. నా కంటే ఎక్కువ ఈ సినిమానే మాట్లాడుతుంది. మొదటి రోజే వచ్చి చూడాలని ఆడియన్స్‌ను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ డే మీరు చూస్తేనే సినిమా బతుకుతుంది’ అన్నారు.