calender_icon.png 2 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశభక్తుల నిస్వార్థ త్యాగాలతో స్వాతంత్య్రం

15-08-2024 12:00:00 AM

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు  

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, నిస్వార్థ త్యాగాలతో మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. మహానుభావులు చూపిన అడుగుజాడల్లో నడుస్తూ, వారి కలలను సాకారం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం  ఓ ప్రకటన విడుదల చేశారు. భారత జాతికి స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజు అందరికీ పవిత్రమైన రోజని పేర్కొన్నారు. మాతృభూమి విముక్తి కోసం అచంచలమైన సంకల్పంతో ఎందరో పోరాడారని గుర్తుచేశారు. వారి స్ఫూర్తితో బలమైన దేశాన్ని నిర్మించడంలో సమిష్టిగా అందరూ కృషిచేయాలని పేర్కొన్నారు. అందరికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడం, మహిళలకు సాధికారతను కల్పించడం, తద్వారా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని తెలిపారు.