calender_icon.png 4 January, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీ కార్మికుల నిరవధిక సమ్మె

01-01-2025 07:13:33 PM

తూతూ మంత్రంగా అధికారుల హామీలు, చర్చలు..

పరిష్కరించకపోతే నిరసన ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిక..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక బీట్ బజారు ఆవరణంలో సివిల్ సప్లైగోదాం దగ్గర బుధవారం ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను హమాలీ కార్మికులు ప్రారంభించారు. ఈ సందర్బంగా సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు తిప్పని సత్తన్న, ప్రధాన కార్యదర్శి బైరి రాజన్నలు మాట్లాడుతూ... పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ చార్జీలు పెంచాలని గతంలో అక్టోబర్ 4 రోజున రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు వారిని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తమ న్యాయపరమైన సమస్యల పరిష్కరించాలని కోరగా వెంటనే స్పందించిన సివిల్ సప్లై కమిషనర్ డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్పందన లేకపోగా డిసెంబర్ 18న సమస్యలు పరిష్కరించాలని సివిల్ సప్లై ఆఫీస్ ముట్టడి చేసామన్నారు. ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ వెంటనే మా డిమాండ్స్ ను పరిష్కరించాలని నేటి నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని యెడల నిరవధిక సమ్మెను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున హమాలీ కార్మికులు పాల్గొన్నారు.