calender_icon.png 22 October, 2024 | 11:32 PM

జీతాలు ఇవ్వకుంటే నిరవధిక సమ్మె తప్పదు

18-09-2024 07:48:24 PM

అర్థ సంవత్సరాని కోసారి జీతాలా...?

AITUC జిల్లా కార్యదర్శి కొండన్న         

ఒకరోజు సమ్మె నోటీసు అందజేత

నారాయణపేట,(విజయ క్రాంతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆధ్వర్యంలోని ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ కార్మికులకు అర్థ సంవత్సరానికి ఒకసారి వేతనాలు ఇస్తే ఎట్లా బతుకుతారు? అని, ఇచ్చే అరకొర జీతాలు కూడా ఆరు మాసాలకు  ఓసాఇస్తారా అని AITUC నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్ర జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ కి ఒకరోజు సమ్మె నోటీసును అందించారు.

ఈ సందర్భంగా కొండన్న మాట్లాడుతూ... ఆసుపత్రులలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలు చేస్తారని సరిహద్దు సైనికులకు శత్రువులు ఎదురుంగా ఉంటే ఆసుపత్రిలో పేషెంట్లకు సేవలు చేసే శ్రామికులకు వైరస్ లు/రోగాల రూపంలో కనబడకుండానే శత్రువు దాడి చేస్తాదని, అంతటి ప్రమాదకర పని చేస్తున్న కార్మికుల పట్ల పాలక ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు నెలనెలా వేతనాలు ఇవ్వకుండా 5, 6,7 నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని 5,6,7 నెలలుగా బకాయి వేతనాలు చెల్లించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పోరాటం చేస్తుంటే ఇప్పటికీ స్పందించడం లేదని, ఇప్పటికైనా కార్మికుల బకాయి వేతనాలు చెల్లించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ కాంట్రాక్ట్ కార్మిక చట్టాలను అమలు చేయాలని తెలిపారు. లేనియెడల కార్మికులు నిరవధిక సమ్మె బాట పడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, AITUC జిల్లా నాయకులు సంతోష్, AITUC తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సభ్యులు కార్మికులు మహేశ్వరి, కవిత, అనిత, లక్ష్మి, కవిత, వెంకటయ్య, ప్రకాష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.