హుజూర్ నగర్ : గత మూడు సంవత్సరాలుగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ లో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ప్రియదర్శిని కళాశాల రెండవ రోజు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ పశ్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్టిఎఫ్ చెల్లించక పోవడంతో కళాశాల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ బంద్ కు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రియదర్శిని డిగ్రీ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ మట్టపల్లి రవీందర్, సిహెచ్ బాలు అధ్యాపకులు పాల్గొన్నారు.