08-04-2025 12:12:12 AM
రాళ్లతో కొట్టిన బాధితురాలు
మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 7: ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన మరవకముందే మేడ్చల్ మధ్య రైలు పట్టాల వద్ద యువతి పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన యువ తి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటోంది.
ఆదివారం రాత్రి గౌరవెల్లి నుంచి మేడ్చల్ వైపు రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ వ్యక్తిని రాయితో కొట్టిం ది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.