26-03-2025 12:34:03 AM
భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి
ముషీరాబాద్,: మార్చి 25: (విజయక్రాంతి):భారతదేశ నైతిక విలువలు, సాంస్కృతిక నైతికతను దిగజార్చే అసభ్యకరమైన అందాల పోటీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలనీ భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేసారు.
హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్-2025 అందాల పోటీలను నిర్వహించడాన్ని వ్యతరేకిస్తూ మహిళలను హానికరమైన వస్తురూపీకరణ, సామ్రాజ్యవాద ప్రయోజనాలను ప్రోత్సహించే ఈ పోటీలను తక్షణమే రద్దు చేయా లని డిమాండ్ చేస్తూ మంగళవారం హిమాయత్ నగర్ వై వై జంక్షన్ వద్ద ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్బంగా నేదునూరి జ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సృష్టికి పథకాలను ప్రవేశపెట్టడంలో, మహిళల భద్రతను నిర్ధారించడం లో, మహిళలపై హింసాత్మక చర్యలపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. ఎన్‌ఎఫ్‌ఐ డబ్ల్యూ సీనియర్ నాయకురాలు పి.ప్రేమ్ పావని మాట్లాడుతూ అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు హైదరాబాద్లో మిస్ వరల్ పోటీని నిర్వహించడం ద్వారా తెలంగాణకు అదనపు ఖర్చు తప్ప ఏమి లభిస్తుందని ప్రశ్నించారు.
ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పడాల నళిని, ఎస్.ఛాయాదేవి లు మాట్లాడుతూ అం దాల పోటీలను వెంటనే రద్దు చేయాలనీ లేనిపక్షంలో మే 7 నుండి 31 వరకు జరిగే ఈ పో టీలను అడుగడునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫైమీద, నాయకురాళ్లు ఎన్.కరుణ కుమారి, జ్యోతి శ్రీమాన్, షహనా అంజూమ్, రొయ్యల గిరిజ, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.